టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యార్.. బీసీసీఐ నుంచి పిలుపు

టీమిండియా టీ20 కెప్టెన్ ఎంపిక కసరత్తు పూర్తైంది. ప్రస్తుత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్థానంలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఎంపికైనట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లకు టీమిండియా కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ ఉండనున్నాడు. గురువారం జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని ఓ జాతీయ మీడియా వెల్లడించింది. వైస్ కెప్టెన్‌గా తెలుగు కుర్రాడు తిలక్ వర్మను నియమించనున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం..శ్రేయస్ అయ్యర్‌ను టీ20 కెప్టెన్‌గా నియమించాలనే నిర్ణయం ఇప్పటికే తీసుకున్నారని,...