రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి…యువత మహనీయుల చరిత్ర చదవాలి జ్ఞానం పెరుగుతుంది-మెరుగు జానీ
వేములపల్లి,ప్రజాశక్తి ఏప్రిల్ 14: మహానీయుల చరిత్ర చదవాలి,మహానీయుల చరిత్ర చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుందని మెరుగు జానీ అన్నారు.వేములపల్లి మండల పరిధిలోని ఆమనగల్లు మహారాజుల కాలనీ యువ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.ఈ సందర్భంగా జానీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మహనీయుల చరిత్ర చదవాలని,మహనీయుల చరిత్ర వల్ల జ్ఞానం పెరుగుతుందన్నారు.అంబేదర్కర్ ఆశయ సాధనకు కృషి చేసి ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలన్నారు.బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు...