
మన ప్రజాశక్తి,నల్లగొండ అక్టోబర్ 8:
స్థానిక సంస్థలు ఎన్నికలు జడ్.పి.టి. సి యం.పి.టి.సి నామినేషన్లు దాఖల వేయనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం నడుచుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ పార్టీల తరుపున అభ్యర్థులు నామినేషన్ల దాఖలు ఊరేగింపు కార్యక్రమం కొరకు అనుమతి పొందాలని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందుగా పోలీసు శాఖ అధికారులకు సమాచారం అందించాలి,అభ్యర్థి అనుమతి పొందిన వాహనాలు మాత్రమే వాడాలని అన్నారు.రాజకీయ పార్టీలు అభ్యర్థి నామినేషన్ దాఖలు ఊరేగింపు సమయంలో ఎన్నికల నిబంధనలకు లోబడి నిర్వహించాలని, కుల, మత, ప్రాంత, వర్గ విబేధాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడరాదు అన్నారు.వాహనాలకు లౌడ్ స్పీకర్లు వినియోగిచుటకు సంబంధిత అధికారుల నుండి అనుమతి పొందాలి.అభ్యర్థి వాహనాలకి రిటర్నింగ్ అధికారి నుండి ముందస్తు అనుమతి పొందవలసి ఉంటుంది,రిటర్నింగ్ అధికారి జారీ చేసిన పర్మిట్‌ను ఒరిజినల్ కాఫీ ప్రదర్శించాలి.వాహనం యొక్క విండ్‌స్క్రీన్‌పై పర్మిట్ వాహనం నంబర్,అభ్యర్థి పేరు ఎవరికి అనుకూలంగా జారీ చేయబడిందో తప్పనిసరిగా కలిగి ఉండాలి.ఒక అభ్యర్థి ఊరేగింపుతో నామినేషన్ దాఖలు చేయడానికి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోకి రావడానికి అనుమతించబడును.రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి ప్రవేశించడానికి ఎన్నికల నిబంధనల మేరకు అభ్యర్థి తో సహా ఇతరులకు ప్రవేశం ఉంటుంది.

Recent Comments