
జగిత్యాల పట్టణం (మన ప్రజాశక్తి ప్రతినిధి) అక్టోబర్ 8 :
భూభారతి రెవెన్యూ సదస్సుల దరఖాస్తులపై రెవెన్యూ అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం కలెక్టర్ సత్యప్రసాద్. నిర్వహించారు.కలెక్టరేట్ మీటింగ్ హాల్లో నిర్వహించిన సమావేశంలో గత భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను వీలైనంత తొందరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తహసీల్దారులని ఆదేశించారు.ఆర్ ఎస్సార్ తేడా ఉన్న సర్వే నెంబర్ల మీద క్షేత్ర స్థాయిలో, రికార్డు పరంగా విచారణ చేసి సరి చేయాలనీ ,సాధబైనమా కేసులను పరిష్కరించాలని, అసైన్మెంట్ కేసుల్లో ఎంక్వైరీ పూర్తి చేయాలని,కోర్టు కేసుల్లో ఉన్న భూముల విషయం లో కౌంటర్ దాఖలు చేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదేశించారు. భూసేకరణ విషయంలో తొందరగా అవార్డు చేయాలని , ఫారెస్ట్ రెవెన్యూ వివాదాలు జాయింట్ సర్వే చేసి పరిష్కారం చేయాలని ఆదేశించారు.ప్రతి ప్రభుత్వ, అసైన్డ్ ,ఇరిగేషన్, భూదాన్, వక్ఫ్, ఎండోమెంట్ ,శిఖం భూములకు
జీఐఎస్ బేస్డ్ సర్వే మ్యాప్ తయారు చేసి సంబంధిత సైట్ లో అప్లోడ్ చెయ్యాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిణి, జగిత్యాల కోరుట్ల మెట్పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారులు,జిల్లా తహసీల్దార్లు పాల్గొన్నారు.

Recent Comments