Monday, January 26, 2026

సమాచార హక్కు చట్టం పై అవగాహన కార్యక్రమం

అడవిదేవులపల్లి /అక్టోబర్ 10 మన ప్రజాశక్తి :
అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 2005 గురించి  ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో  తహసిల్దార్ రాగ్య నాయక్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ శాఖలలో జవాబుదారీతనాన్ని పెంచడం,పనితీరులో  పారదర్శకతను అవినీతిని అంతం చేయుటకు ఏర్పాటయిందన్నారు పౌరులు సమాచార హక్కు చట్టం కొరకు సాదా కాగితం మీద దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.తహసిల్దార్ కార్యాలయంలో సమాచార అధికారి  నాయబ్ తహసిల్దార్ ఉంటారన్నారు. సమాచారం 30 రోజులలో ఇవ్వని ఎడల అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు.సంబంధిత అధికారి సమాచారం గడువులోపు ఇవ్వని ఎడల సమాచార కమిషన్ వారికి 250 రూపాయల నుండి 25వేల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు అన్నారు.దరఖాస్తును స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపవచ్చుఅన్నారు.ఈ కార్యక్రమంలో నాయభ్ తహసిల్దార్ శ్రీనివాస్ రెవెన్యూ, ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్, సీనియర్ అసిస్టెంట్ సాయి  జూనియర్ అసిస్టెంట్లు పాపయ్య స్వామి హరిలాల్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!