మన ప్రజాశక్తి,మిర్యాలగూడ అక్టోబర్ 10:
మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు అగ్రికల్చర్ అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారితో ఏర్పాటు చేసిన సమావేశంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఖరీఫ్ పంట గతంలో కంటే ఎక్కువగా పెరగడంతో అధికంగా ధాన్యం దిగుబడి అయ్యే అవకాశం ఉందని ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని కోరారు.అలాగే ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అగ్రికల్చర్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రైతులకు అండగా ఉండాలని అదేశించారు.ఈ సమావేశంలో మండల ఇన్చార్జి వ్యవసాయ శాఖ అధికారి సైదా నాయక్,మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరీ శ్రీనివాస్, మిల్లర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ చౌదరి, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Recent Comments