దమ్మపేట తాసిల్దార్ కార్యాలయంలో అనధికారిక వీఆర్ఏ హవా
అధికారికమా అనధికారిక నియామకమా తెలియాల్సి ఉంది
గతంలో తలారిగా చేసి, తన “తమ్ముని కొడుకును నేడు వీఆర్ఏ గా చలామణి చేస్తూ, అది ఎలా సాధ్యం..?
ప్రజాశక్తి,దమ్మపేట అక్టోబర్ 22:
భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండల తాసిల్దార్ కార్యాలయంలో ఉన్నత అధికారుల కళ్ళుగప్పి వీఆర్ఏ ఉద్యోగం వెలగబెడుతున్న ముదగండ్ల నాగేందర్ రావు అనే వ్యక్తి. గత రెండు సంవత్సరాలుగా వీఆర్ఏగా అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న నాగేంద్రరావు. పూర్తి వివరాల్లోకి వెళితే గతంలో ముదగండ్ల పెద్ద వెంకటేష్ తండ్రి నాగయ్య తలారి ఉద్యోగం చేసేవారు. గత రెండు సంవత్సరాల క్రితం పెద్ద వెంకటేష్ తమ్ముడు చిన్న వెంకటేష్ కొడుకు నాగేందర్రావు అధికారుల దృష్టి మరల్చి వీఆర్ఏగా ఉద్యోగం నిర్వహిస్తున్నాడు దమ్మపేట తాసిల్దార్ కార్యాలయంలో అతడు చెప్పిందే వేదం. అతగాడు ఇప్పుడు దమ్మపేట మండలంలో వడ్డీ వ్యాపారి అయ్యాడు అంటే అతను వీఆర్ఏగా రెండు సంవత్సరాలుగా ఏ విధంగా చలామణి అవుతున్నాడు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. త్వరలో పెర్మనెంట్ గ నియామక పత్రం అందుకోబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. తలారిగా విధులు నిర్వహించిన పెద్ద వెంకటేష్ వారసత్వంగా వారసుడు రాజా ఉద్యోగం చేయాల్సింది. ఏమి జరిగిందో ఏమో గాని అతని స్థానంలో వీఆర్ఏ గా ముదగండ్ల పెద్ద వెంకటేష్ తమ్ముడు చిన్న వెంకటేష్ కుమారుడు నాగేందర్రావు విధులను నిర్వహిస్తున్నాడు. అతని టూ వీలర్ బైక్ పైన రెవెన్యూ డిపార్ట్మెంట్ అని రాసుకొని దర్జాగా అక్రమ పద్ధతిలో విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసే జరుగుతుందా అన్నది ప్రశ్న. ఇప్పటికే అతను ఎంతోమందికి అధికారికంగా బై నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఇతగానికి అధికారులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది. త్వరలో అధికారికంగా పర్మనెంట్ లెటర్ అందుకోబోతున్న ఆనందంలో ఉన్నాడు మరి ఇది అధికారిక నియామకమా అనధికారికా నియామకమా తెలియాల్సింది. గతంలో అనేక పత్రికలలో ప్రచురించినప్పటికీ అధికారులు అనధికారిక నియామకంపై చర్యలు తీసుకపోవడం వెనుక అంతర్యం ఏమిటి అని ప్రశ్నిస్తున్న ప్రజలు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దమ్మపేట తాసిల్దార్ కార్యాలయంలో పై దృష్టి పెట్టి అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్న దమ్మపేట గ్రామ ప్రజలు.



Recent Comments