Monday, January 26, 2026

ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం


రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి…. ఎమ్మార్వో హిమబిందు,ఎంపీడీవో హరిసింగ్
ప్రజాశక్తి,అనంతగిరి అక్టోబర్ 22:
మండల పరిధిలోని పలుగ్రామాల్లో ఐకేపీ ద్వారా ఎర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్  హిమబిందు,ఎంపీడీఓ హారిసింగ్,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ముసుకు శ్రీనివాసరెడ్డి తో కలిసి బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ, సొసైటీ ల ద్వారా సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.ధాన్యంలో తేమశాతం 17 కి మించకుండా ఉండాలని,బాగా ఎండబెట్టి తాలు మట్టి లేకుండా ఉండే విధంగా చూడాలని, తూకం వేసి ఆన్లైన్ లో అప్లోడ్ కాగానే 24 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమచేస్తారని తెలిపారు. ఎ గ్రేడ్ మద్దతు ధర 2389 రూపాయలు, సాధారణ రకం 2369 రూపాయలు, సన్నరకం ధాన్యంకు అదనంగా బోనస్ 500 రూపాయలు ఇస్తారని తహసీల్దార్,ఎంపీడీఓలు తెలిపారు.అనంతరం ముసుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల అభ్యున్నతికి పాటు పడుతోందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏవో అందె సతీష్, ఏటఎం  సౌజన్య,మాజీ ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు,నాయకులు బుర్ర పుల్లారెడ్డి,గునుకుల గోపాల్ రెడ్డి,భానోత్ బాబునాయక్,డా.ముత్తీ నేనీ కోటేశ్వరరావు,డేగ కొండయ్య,రాఘవ రెడ్డి,అనిల్ రెడ్డి, వేనుపల్లి చిన్న వెంకటయ్య, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!