Monday, January 26, 2026

రక్తదానం చేయండి  ప్రాణదాతలు కండి…!జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్

ప్రజాశక్తి,నల్లగొండ అక్టోబర్ 24:
పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమరవీరుల త్యాగలను స్మరిస్తూ జిల్లా వ్యాప్తంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో  రక్త దానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ రక్త దాన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పి  ప్రారంభించి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పోలీసులతో పాటు యువకులు ఎక్కువ అధిక సంఖ్యలో పాల్గొని దాదాపు 150 యూనిట్లు రక్తదానం చేయడం జరిగిందని ఎస్పీ  తెలిపారు.యువత ఎక్కువగా రక్త దానం చేయాలని ఎంతో మంది ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఇబ్బంది పడుతున్నారని అన్నారు.అలాంటి వారిని ఆదుకొని ప్రాణ దాతలు కావాలి అన్నారు.పోలీసు శాఖ సమాజ భద్రతే కాకుండా సమాజ సేవ చేయుటకు కూడా ముందు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఫౌండేషన్ తరపునా వచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని ఎస్పీ  అభినందించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్,ఏ.ఆర్ డిఎస్పి శ్రీనివాస్ టూ టౌన్ సిఐ రాఘవరావు, వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి,ఆర్.ఐలు సంతోష్,శ్రీను,హరిబాబు, ఆర్.యస్.ఐలు కళ్యాణ్,రాజీవ్, సాయిరాం, సంతోష్,అశోక్, శ్రావణి సిబ్బంది,యువత పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!