Monday, January 26, 2026

హాస్టల్  చుట్టూ ముట్టిన వరద నీరు..!వరదలో చిక్కుకున్న విద్యార్థులను తాళ్ల సహాయంతో  రక్షించిన పోలీసులు

తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ శరత్ చంద్ర పవార్

ప్రజాశక్తి,నల్లగొండ అక్టోబర్ 29:
మొంథా తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా ఎస్పీ అన్నారు.సోమవారం నుండి ప్రారంభమైన తుఫాన్ తో దేవరకొండ కోమ్మెపల్లి గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో వరదనీటిలో చిక్కుకున్న విద్యార్ధులను తక్షణమే స్పందించి సిబ్బందితో కలిసి సురక్షిత ప్రాంతానికి తరలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.మొంథా తుఫాను కారణంగా జిల్లాలో ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.అత్యవసరమైతే తప్ప ప్రజలు రోడ్ల పైకి అనవసరంగా రాకూడదు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని,ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ అధికారులకు  సూచించారు.ప్రజలు పోలీస్ వారికి సహకరించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!