
ప్రజాశక్తి, మిర్యాలగూడ అక్టోబర్ 29:
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు మిర్యాలగూడ ప్రభుత్వ హాస్పిటల్ లో రక్త దానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ రక్త దాన కార్యక్రమంలో మిర్యాలగూడ పోలీసులతో పాటు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయడం జరిగిందని డిఎస్పి అన్నారు.యువత ఎక్కువగా రక్త దానం చేయాలని ఎంతో మంది ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఇబ్బంది పడుతున్నారని అన్నారు.అలాంటి వారిని ఆదుకొని ప్రాణ దాతలు కావాలి అన్నారు.పోలీసు శాఖ సమాజ భద్రతే కాకుండా సమాజ సేవ చేయుటకు కూడా ముందు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని డిఎస్పి రాజశేఖర రాజు ఏరియా హాస్పిటల్ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ సమరధ్ తో కలిసి అభినందించారు.ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ నాగభూషణరావు, టూ టౌన్ సిఐ సోమ నరసయ్య, రూరల్ సీఐ పిఎన్డి ప్రసాద్, వన్ టౌన్ ఎస్ఐ సైదిరెడ్డి, టూ టౌన్ ఎస్ఐ రాంబాబు,పోలీస్ సిబ్బంది,యువత పాల్గొన్నారు.


Recent Comments