
ప్రజాశక్తి, మిర్యాలగూడఅక్టోబర్ 29: దేశ రాజధానిలో అత్యున్నత న్యాయవ్యవస్థైన సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ మీద దాడి జరిగితే ఇప్పటికీ కేసులు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ నవంబర్ 1 న ఛలో హైదరాబాద్ పేరుతో లక్షలాది మందితో దళితుల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ అన్నారు.
మిర్యాలగూడ ఎమ్మార్పీఎస్ పట్టణ కార్యవర్గ సమావేశం పట్టణ అధ్యక్షులు ఉబ్బపల్లి రాజ్ కుమార్ మాదిగ అధ్యక్షతన ఆర్యవైశ్య భవన్ లో జరిగింది.ఈ కార్యక్రమంలో గోవిందు నరేష్ మాదిగ మాట్లాడుతూ ” సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ స్థానంలో ఉన్న దళితుడికే రక్షణ లేకపోతే దేశంలో సామాన్య దళితులకు రక్షణ ఎలా ఉంటుందని అన్నారు.ఈ దాడి జరిగి 12 రోజుల గడుస్తున్నా ఇప్పటికీ కేసు నమోదు చేయకపోవడం దారుణమని అన్నారు.జస్టిస్ గవాయ్ స్థానంలో ఉన్నత కులాలకు చెందిన జడ్జీ ఉంటే కేసు నమోదు చేయడంలో ఇలా నిర్లక్ష్యం చేసి ఉండే వారా? అని ప్రశ్నించారు.అందుకే జస్టిస్ బిఆర్ గవాయ్ మీద జరిగిన దాడి దళితులపైన జరిగిన దాడిగా చూస్తున్నామని అన్నారు.దళితులు ఎంత ఉన్నత స్థానానికి కష్టపడి ఎదిగినా కుల రక్కసి వెంటాడుతుందని అన్నారు.అందుకే గవాయి పై దాడి ఘటనను నిరసిస్తూ జాతీయ స్థాయిలో దళితుల ఆత్మగౌరవ పోరాటం చేపడుతున్నామని అన్నారు. గవాయ్ పైన జరిగిన దాడి వల్ల దేశంలో ఉన్న దళితుల హృదయాలు తీవ్ర ఆవేదనకు గురయ్యాయని అన్నారు.కానీ 12 రోజులుగా ఎదురు చూస్తున్నా నేటికీ న్యాయం జరగలేదని అన్నారు.కనుకనే ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. తక్షణమే దాడి ఘటన మీద కేసు నమోదు చేయాలి.నిందితుడిని అరెస్టు చేసి జైలులో పెట్టాలి.అలాగే ఈ ఘటన మీద సుప్రీం కోర్టు రిటైర్డు జడ్జీ చేత విచారణ జరిపించి దీని వెనుక ఉన్న శక్తులను గుర్తించాలి.ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా సహించేది లేదని అన్నారు.చీఫ్ జస్టిస్ పై దాడి విషయంలో న్యాయాన్ని కోరుతూ నవంబర్ 1 న లక్షలాది మందితో ఛలో హైదరాబాద్ పేరుతో దళితుల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తామని , ఈ ర్యాలీలో ఆత్మగౌరవంతో జీవించాలని కోరుకునే దళిత ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు దైద సత్యం మాదిగ,జిల్లా ప్రధాన కార్యదర్శి సందాల శంభయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు మోహన్ మాదిగ,అంబేద్కర్ యువజన సంఘం మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు దైద శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ మిర్యాలగూడ పట్టణ ప్రధాన కార్యదర్శి ఏల్తూరి అఖిల్, ఉబ్బపల్లి పేద్ద ఎల్లయ్య, దైద వెంకటేశ్వర్లు బొంగరాల నాగయ్య, దైద రవి, ఉబ్బపల్లి శంకర్ నందిపాటి నరేష్ , దైద గోపి, దైద శ్రీకాంత్, కత్తుల అవినాష్, దైద సాయినాథ్, ధైద శరత్ కుమార్, ఇరుగు యశ్వంత్, నాని, సాయి కొత్తపల్లి గణేష్, శ్రీకాంత్, వంశీ నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.

Recent Comments