
ప్రజాశక్తి,మిర్యాలగూడ అక్టోబర్ 30:
వచ్చేనెల 16న మిర్యాలగూడ పట్టణంలోని భక్త ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించే యజ్ఞానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని గురుస్వాములు దస్రు, కొమ్ము ముత్యాలు, గుంజ గురు స్వామి, ధనావత్ చిన్న, నక్క విజయ్ కోరారు. గురువారం స్థానికంగా వారు మాట్లాడారు. శివ, ఆంజనేయ, భవాని, దత్తాత్రేయ స్వాములతో పాటు… భక్తులు ఈ యజ్ఞానికి వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో నిర్వహించే పూజలు ఆధ్యాత్మిక అభివృద్ధితో పాటు… ఏకాగ్రత సాధించేందుకు ఉపయోగపడతాయని చెప్పారు. స్వాములు, భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.

Recent Comments