Monday, January 26, 2026

అసైన్డ్ భూముల పెండింగ్ సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలి…!రెవెన్యూ అధికారుల సమావేశంలో..జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

ప్రజాశక్తి,నల్లగొండ అక్టోబర్ 31:
పెండింగ్ లో ఉన్న వివిధ దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవిన్యూ అధికారులను ఆదేశించార.శుక్రవారం కలెక్టర్  కార్యాలయంలోని సమావేశ మందిరంలో రెవిన్యూ  అధికారులతో  రెవెన్యూ అంశాల పై సమీక్షించారు.పెండింగ్ లో ఉన్న భూ రికార్డులు, భూ భారతి, భూ వివాదల దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రతి మండలంలో పెండింగ్ ఫిర్యాదులను వారానికి ఒకసారి సమీక్షించాలని ,భూ సంబంధ వ్యవహారాల లో పారదర్శకతకు ప్రాద్యనత ఇవ్వాలని,ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని చెప్పారు.సాదా బై నామల పై వచ్చిన ఫిర్యాదులను  సైతం జాప్యం లేకుండా పరిష్కరించాలని చెప్పారు.అసైన్డ్ భూముల విషయంలో పెండింగ్ సమస్యలు త్వరగా పరిష్కరించాలని, రెవిన్యూ అధికారు లందరూ అంకితభావంతో, చిత్త శుద్ధితో పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరారు.మొంథా తుఫాను సందర్బంగా భారీ వర్షాలతో చుట్టూ వరద నీరు చేరిన దేవరకొండ మండలం,కొమ్మేపల్లి ఎస్ టి గురుకుల పాఠశాల విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించిన మండల ,డివిజన్  రెవెన్యూ అధికారులను కలెక్టర్ అభినందించారు.అదనపు కలెక్టర్. జే శ్రీనివాస్, స్థానిక సంస్థలు ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్,నల్గొండ ఆర్డీవో వై.అశోక్ రెడ్డి, దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, చండూరు ఆర్డీవో శ్రీదేవి,తహశీల్దార్లు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!