ప్రజల మనసెరిగిన నాయకుడు నవీన్ యాదవ్- ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

ప్రజాశక్తి, మిర్యాలగూడ నవంబరు 2:
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
నవీనా యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ లో ఎగిరే జెండా నవీన్ అన్నదే. గడప గడపకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను వివరిస్తూ ప్రచారంలో మిర్యాలగూడ శాసనసభ్యులు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం యువతను ప్రోత్సహించాలనే లక్ష్యంతో జూబ్లీహిల్స్ స్థానిక యువ నాయకుడు నవీన్ యాదవ్ కు అన్ని వర్గాలతో సుపరిచితుడి పేరు ప్రకటించడంతో భారీ మెజార్టీతో గెలుపు ఖరార్ అయిందని అన్నారు.యువతను ప్రోత్సహించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ.నియోజకవర్గానికి చెందిన స్థానికనేతగా, అన్ని వర్గాలతో నవీన్ యాదవ్ మంచి గుర్తింపు ఉందనీ యాదవ సామాజిక వర్గానికి చెందిన నవీన్ కు బిసి వర్గాల్లో మంచి పట్టుందనీ నియోజకవర్గంలో మెజారిటీ ఉన్న ముస్లిం మైనారిటీ వర్గాలు సోదరుడుగా వివిధ వర్గాల ప్రజల మనందలు పొందిన వ్యక్తి..జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి నవీన్ యాదవ్ గెలుపుతో ఆ ప్రాంత అభివృద్ధికి మరింతగా పాటుపడతారని బిఎల్ఆర్ పేర్కొంటున్నారు.గడపగడప ప్రచారంలో ప్రజల మనసెరిగిన నాయకుడిగా నవీన్ యాదవ్ నియోజకవర్గానికి మరింత మేలు చేస్తారని ఇక్కడి ప్రజల మాటలలోనే విజయం ఖరారు అయిందన్నారు.జూబ్లీహిల్స్ ప్రజలు ఒక్క అవకాశం నవీన్ యాదవ్ కు ఇవ్వాలని కోరారు.వారు వెంట వేములపల్లి మండల నాయకులు,ఆమనగల్లు తాజా మాజీ సర్పంచ్ వల్లంపట్ల ప్రవీణ్, కామేపల్లి రామచంద్రయ్య, నాగవెల్లి మధు, జిల్లా ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ పుట్టల శ్రీను, వేములపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు పుట్టల పెద్ద వెంకన్న,యూత్ కాంగ్రెస్ నాయకులు పళ్ళ అశోక్ తదితరులు ఉన్నారు.


Recent Comments