Monday, January 26, 2026

నవీన్ యాదవ్ గెలుపే బీసీల రాజకీయ భవిష్యత్తుకు మలుపు…!తెలంగాణ బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్

పేదల ముఖంలో చిరునవ్వులు: బీసీ కార్పొరేషన్ చైర్మన్


ప్రజాశక్తి,హైదరాబాద్ అక్టోబర్ 6:

జూబ్లీహిల్స్ లో ఉపఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే బీసీల రాజకీయ భవిష్యత్తుకు మలుపు అవుతుందని, తెలంగాణ బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, నూతి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. గత కొద్ది రోజుల నుండి  జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని వివిధ ప్రాంతాలలో శ్రీకాంత్ గౌడ్ ఇంటింటి ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా గురువారం నాడు ఆయన మాట్లాడుతూ, అన్ని బీసీ కులాలు నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని నవీన్ యాదవ్ విజయానికి కృషి చేయాలని కోరారు.ప్రతిపక్షాల మాటలు నమ్మి ఓటర్లు మోసపోవద్దని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కచ్చితంగా నెరవేరుస్తూ ముందుకు సాగుతుందని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఆదరించి భారీ మెజారిటీతో నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. 10 సంవత్సరాల పాలనలో భారత రాష్ట్ర సమితి నిరుద్యోగులను గాలికి వదిలేసిందని, ఉప ఎన్నికలలో లబ్ధి పొందేందుకు మొసలి కన్నీరు కారుస్తున్నారని, పది సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలోనికి రానివారు ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారని, ఓటర్లంతా వారిని నిలదీయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు లక్షలాదిమంది జీవితాలలో వెలుగులు నింపుతుంటే, అది చూసి ఓర్వలేక భారత రాష్ట్ర సమితి, బిజెపి నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని సంక్షేమం అభివృద్ధి కాంగ్రెస్ ఎజెండా అని ఆ దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.*పేదల ముఖంలో చిరునవ్వులు*:కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం ఇవ్వడంతో వారి ముఖాలలో చిరునవ్వులు కనిపిస్తున్నాయని, కొన్నేళ్లుగా తెల్ల రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడ్డ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడం, ప్రజలలో ఆనందాన్ని నింపిందని, ఎన్నికలలో ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ప్రజలు అభివృద్ధికి ఓటు వేయాలని నూతి శ్రీకాంత్ గౌడ్ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!