ముగ్గురు నిందితుల అరెస్ట్ ఒకరు పరారీలో…నిందితుల నుండి 288 (172.8గ్రామ్స్) టాబ్లెట్లు స్వాధీనం.

ప్రజాశక్తి,మిర్యాలగూడ నవంబర్ 8:
తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న మాదకద్రవ్యాల నిర్మూలన లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపి నిరంతర నిఘా లో బాగంగా,నవంబర్ 8వ తారీకు ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు ఉదయం 06.30 గంటల సమయములో మిర్యాలగూడ టౌన్, ఈదులగుడ సెంటర్ దగ్గరలో వెహికిల్ చెకింగ్ చేస్తుండగా, ఇద్దరు వ్యక్తులు చేతులో కవర్లతో నడుచుకుంటూ అనుమానాస్పదముగా కనపించగా,వారిని అదుపులో తీసుకొని విచారించగా మత్తు టాబ్లెట్లు కోసం కారంపూడి లోని వీరభద్ర మెడికల్ & ఫ్యాన్సీ షాప్ లో కొనుగోలు చేసినట్లు తెలిపారు.వెంటనే నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.నిందితుల వివరాలు:మచ్చ నవీస్(23)సీతారాంపురం, మిర్యాలగూడ.నక్క మహేష్(22) సీతారాంపురం, మిర్యాలగూడ పట్టణం,శెట్టి హనుమంతరావు(58) మెడికల్ షాప్,కారంపూడి పల్నాడు జిల్లా,పరారీలో ఉన్న నిందితుడు ప్రసాద్(31) మెడికల్ షాప్ ప్రొప్రైటర్, ఫల్నాడు జిల్లా,మచ్చ నవీన్, నక్క మహేష్ ఇద్దరు కలిసి గత కొంతకాలంగా మత్తు కోసం వారు పల్నాడు జిల్లా, కారంపూడి మండలం కారంపూడి గ్రామం లోని హనుమంతరావు,ప్రసాద్,వీరభద్ర మెడికల్ & ఫ్యాన్సీ షాప్’ నుండి స్పాస్మో ప్రాక్సివాన్ ప్లస్ టాబ్లెట్స్ ను అదిక ధరకు అక్రమంగా విక్రయిస్తూ అక్రమలాభార్జన చేస్తున్నారు.నిందితులపై ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేయనైనది.నిందితుల వద్ద స్పాస్మో ప్రాక్సివాన్ ప్లస్ 288 టాబ్లెట్స్ సీజ్ చేయనైనది.డిఎస్పి మాట్లాడుతూ మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని పట్టణ, గ్రామాలలో మత్తు టాబ్లెట్లు,గంజాయి అమ్మిన ,కొన్న వారిపై చట్టమైన చట్టపరమైన చర్యలు తప్పవు. తల్లిదండ్రులు పిల్లలను అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి వారిపై ఎటువంటి అనుమానం వచ్చిన వెంటనే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ కేసును డీఎస్పీ కే.రాజశేఖర రాజు ఆధ్వర్యంలో ఇట్టి కేసును చేదించిన మిర్యాలగూడ టౌన్ సిఐ యం.నాగభూషణ రావు,యస్ఐ ఏ.సైదిరెడ్డి,హెడ్ కానిస్టేబుల్ రాజారామ్, కానిస్టేబుల్స్ వీరబాబు,నరసింహ్మ, ప్రసాద్, శ్రీను, హుస్సైస్ లను మిర్యాలగూడ డిఎస్పి అభినందించారు.

Recent Comments