Monday, January 26, 2026

నవంబర్ 17న చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలి…రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్

సుప్రీం కోర్ట్ జస్టిస్ చీఫ్ గవాయి పై దాడి చేసిన నిందితులను వెంటనే శిక్షించాలి

ప్రజాశక్తి, నకిరేకల్ నవంబర్ 8:
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నవంబర్ 17 వ తారీఖున తలపెట్టిన ఛలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనగా కార్యక్రమం విజయవంతం చేసేందుకు నకిరేకల్ పట్టణంలో రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ . గవాయి మీద దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి, దాడి వెనుక ఉన్న శత్రువులను గుర్తించి వారికి చట్టరీత్యా  తక్షణమే చర్యలు తీసుకోవాలని చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో  శాలిగౌరారం మండల ఉపాధ్యక్షులు అయిలపాక శ్రీనివాస్ మాదిగ,గుండె ఆరుణ్ కుమార్ మాదిగ,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!