అద్భుతం ప్రతిభతో ఆహుతులను మైమరిపించిన చిన్నారులు..
పల్లె అందాలు సింగారించుకున్న శిల్పారామం
ప్రజాశక్తి, నల్లగొండ నవంబర్ 10:
హైదరాబాద్ హైటెక్ సిటి లో గల శిల్పారామం వేదిక యందు భరతనాట్యంలో విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ అందర్నీ ఆకట్టుకుంది.జి.కిషన్ రావు ఐఏఎస్ శిల్పారామం స్పెషల్ అధికారి సంకల్పం సహకారంతో నాట్య డాన్స్ ఇన్స్టిట్యూట్, నల్గొండ జిల్లా వారి ఆధ్వర్యంతో సర్వసిద్ది కళ్యాణి శేఖర్ నాట్య గురువు వద్ద నాట్య శిక్షణ పొందిన చిన్నారులు భరతనాట్య నృత్యన్ని ప్రదర్శించారు.ఉజ్వల ప్రజ్ఞ సోలో ప్రదర్శన సీత కళ్యాణం గానం , ముద్దుగారే యశోద గానం ద్వారా తమ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు. అద్భుతమైన ప్రతిభ ప్రదర్శించి ఆహుతులను అకట్టుకున్నారు. మూషిక వాహన గజానన గానము తో చిన్నారి మోక్షిత , మాన్యశ్రీ, గుణశ్రీ వారి నాట్యంతో అందరిని మైమరిపించారు.విద్యార్ధులు
నెలిశారెడ్డి, మహిమాన్విత, శహస్ర, వర్ణిక, హన్విక,మనస్వి, అద్విత ,ఆరాధ్య, గుణశ్రీ, ఆరాధ్య అరుణ్, లక్మి ప్రసన్న , మాన్యశ్రీ చిన్నారులు అందరూ తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ గా ఎస్. చంద్ర శేఖర్ సారధ్యం వహించారు.ముఖ్య అతిథిగా శిల్పా రామం జనరల్ మేనేజర్ ఆర్.వెంకటేశ్వర్లు, సమాచార పౌర సంబంధాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి.ఉషారాణి, భద్రాచలం ఐటీడిఏ శాఖ సీనియర్ అసిస్టంట్ బి. భవాని పాల్గొని చిన్నారులకు బహుమతుల ప్రదానం చేశారు. భరతనాట్యంలో అద్భుతమైన విశేషమైన ప్రతిభతో చిన్నారులు అధికారుల మన్ననలు పొందడం విశేషం.


Recent Comments