
ప్రజాశక్తి,హైదరాబాద్ నవంబర్ 14.
ఈనెల 11వ తేదీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కు శుక్రవారం నాడు వచ్చిన ఫలితాలు, 25 వేల ఓట్ల మెజారిటీ క్షేత్రస్థాయిలో పనిచేసిన ప్రతి కార్యకర్తకు అంకితం అని తెలంగాణ బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. శుక్రవారం నాడు ఆయన పత్రికలకు ఓ ప్రకటన విడుదల చేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, టీం, రచించిన వ్యూహాలతో జూబ్లీహిల్స్ ఎన్నిక ఖాయం అయ్యిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉంది అని ఎన్నికముందు విస్తృత ప్రచారం చేసిన ప్రతిపక్ష పార్టీలకు నవీన్ యాదవ్ విజయం చెంపపెట్టు లాంటిదని అన్నారు.
అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా, పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తంకుమార్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖలు ఈ ఎన్నికల విషయంలో పాలుపంచుకోవడం అభినందనీయమని అన్నారు. ఎన్నిక ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన ప్రతిపక్ష నాయకులకు జూబ్లీహిల్స్ ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టారని, మరొక ప్రతిపక్ష నేత ఈ ఎన్నికల్లో డిపాజిట్ గల్లంత కావడం విశేషమని అన్నారు. ఏది ఏమైనా ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనకు ఇది రిఫరెండం లాంటిదని, అన్నారు.
*రాష్ట్ర ముఖ్యమంత్రి దూర దృష్టికి నిదర్శనం*: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొని ఆన్ ది రికార్డుగా 15వేల పైచిలుకు ఓట్లు సాధిస్తామని ప్రకటించిన, ఆయన ఆఫ్ ది రికార్డుగా పాతికవేల పైచిలుకు ఓట్లు సాధిస్తామని ధీమాగా ఉండడం ఆయన దూర దృష్టికి నిదర్శనమని, ఇదే ఊపుతో రానున్న జిహెచ్ఎంసి ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందిబి సాధించి తీరుతుందని నూతి శ్రీకాంత్ గౌడ్ పేర్కొన్నారు.

Recent Comments