
మన ప్రజాశక్తి, డిసెంబర్ 23:
పంచాయతీ రాజ్ శాఖ అధికారుల మితిమీరిన నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఉప సర్పంచ్ చెక్ పవర్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారులు తొలుత మెమో విడుదల చేయడం సంచలనంగా మారింది. ఈ మెమో వెలువడిన క్షణాల్లోనే గ్రామ పంచాయతీల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.అయితే, ఈ నిర్ణయం అధికారుల తప్పిదం వల్ల జరిగిందని పంచాయతీ రాజ్ శాఖ వివరణ ఇచ్చింది.సరైన పరిశీలన లేకుండా మెమో జారీ చేసినట్లు అంగీకరించిన అధికారులు,తప్పును సరిదిద్దుకునేందుకు ఆపసోపాలు పడ్డారు.తాజాగా, మొదట విడుదల చేసిన మెమోను సవరించిన అధికారులు,కొత్త మెమోను జారీ చేశారు.ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు అన్న అంశంలో స్పష్టత ఇస్తూ తాజా ఆదేశాలు వెలువడ్డాయి.ఈ మొత్తం వ్యవహారం పంచాయతీ రాజ్ శాఖ పనితీరుపై తీవ్ర ప్రశ్నలు లేపుతోంది.నిర్లక్ష్య నిర్ణయాలతో గ్రామ పాలనపై ప్రభావం పడే ప్రమాదం ఉందని ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Recent Comments