
ప్రజాశక్తి,నల్లగొండ డిసెంబర్ 25:
క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.విశ్వ మానవాళికి తన ప్రేమ తత్వంతో వెలుగులు పంచిన కరుణామయుడు ఏసుక్రీస్తు అని పేర్కొన్నారు.ప్రేమ,కరుణ, శాంతి ద్వారా మానవాళిలో ఆనందం నింపిన ఏసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయం అన్నారు.ఏసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Recent Comments