
జగిత్యాల జిల్లా,మన ప్రజాశక్తి,డిసెంబర్ 26
జాతీయ స్థాయి క్రీడల్లో జగిత్యాల జిల్లా, జగిత్యాల రూరల్ మండల్ అర్పపల్లి గ్రామానికి చెందిన నవోదయ విద్యార్థిని ప్రతిభ కనబరిచింది. ఎలిపెద్ది బుచ్చిరెడ్డి లావణ్య దంపతుల ప్రతమ పుత్రిక హర్షిని ట్రిపుల్ జంప్ పోటీల్లో జాతీయ స్థాయిలో 10వ స్థానాన్ని సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచింది.తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల స్థాయిలో నెంబర్ వన్ స్థానం సాధించిన శ్రీహర్షిని, జాతీయ స్థాయి పోటీల్లోనూ సత్తా చాటి తన ప్రతిభను చాటుకుంది. నవోదయ విద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న ఆమె క్రీడల పట్ల చూపుతున్న నిబద్ధత, కృషి ఈ విజయానికి కారణమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు,ప్రజాప్రతినిధులు శ్రీహర్షినిని ఘనంగా అభినందించారు.భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. శ్రీహర్షిని సాధించిన ఈ విజయం గ్రామ యువతకు ప్రేరణగా నిలుస్తుందని గ్రామానికి చెందిన యువకులు, ప్రజలు తెలిపారు.

Recent Comments