
నేరేడుచర్ల: జనవరి 26 మన ప్రజాశక్తి
నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని అభ్యాస్ హైస్కూల్ నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ సీతారామరెడ్డి మాట్లాడుతూ మహనీయుల యొక్క వీర గాధలను విద్యార్థులకు వివరించడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను విద్యార్థులకు తెలియపరచడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి జెండాను ఆవిష్కరించి విద్యార్థులు భావితరాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. పాఠశాల డైరెక్టర్ లక్ష్మి వీర యోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి అమరవీరుల యొక్క జీవిత చరిత్ర ను విద్యార్థులకు వివరించడం జరిగింది. తర్వాత విద్యార్థులు వివిధ రకాల వేషధారణలోనూ డాన్సులతోనూ అలరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

Recent Comments