Friday, March 6, 2026

ఘనంగా కనుకు దీవెనమ్మ సంతాప సభ


-ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించిన – కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు


ప్రజాశక్తి,వేములపల్లి ఫిబ్రవరి :5
వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామానికి చెందిన కనుకు దివేనమ్మ సంతాప సభకు మాజీ ఉప సర్పంచ్,వార్డ్ నెంబర్లు పాల్గొని ఫోటోకు పూల మాలలు వేసి మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. కనుకు దివేనమ్మ కుటుంబానికి టి.వి.టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ..5000,చింతకాయల వీరేందర్ 50 కేజీల బియ్యం అందజేసి అధైర్య పడొద్దు అని ఆపద సమయంలో కాంగ్రెస్ నాయకులు అండగా ఉంటుందని కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం కల్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ దీవేనమ్మ కనుకు కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ చేసిన సేవలు వెలకట్టలేనివని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కోల సైదులు,మాజీ వార్డ్ నెంబర్లు మెరుగు జాని,పెరుమాళ్ళ రమేష్,ఆమనగల్లు మత్స్యశాఖ డైరెక్టర్ చింతకాయల వీరేందర్,కనుకు నికనర్,ఆమనగల్లు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మెరుగు అనిల్ కుమార్, ఆర్ఎంపీ డాక్టర్ గోవిందు,వల్లంపట్ల సుధాకర్ వల్లంపట్ల వెంకన్న మెరుగు యల్లయ్య,మెరుగు సురేష్ అవిరెండ్ల సురేష్,కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!