Wednesday, March 4, 2026

గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు తవ్వకాలు…!

ప్రజాశక్తి,మిర్యాలగూడ ఫిబ్రవరి 6: గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేసి పురాతన బండరాళ్ల కింద తవ్వకాలు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలోని ఆమనగల్లు గ్రామంలో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కాకతీయుల కాలం నాటి చరిత్ర కలిగిన గ్రామం ఆమనగల్లు పొలిమేర శివారుల్లో ఆమనగల్లు గ్రామానికి చెందిన పెరుమాళ్ళ కృష్ణయ్య వ్యవసాయ భూమిలో పురాతన కాలం నాటి బండరాళ్ళ కింద గుప్త నిధులు ఉంటాయని భావించి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసి సుమారు 6 ఫీట్ల లోతు తవ్వకాలు జరిపారని రైతు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.అధికారులు వెంటనే స్పందించి పంట పొలాలలో క్షుద్ర పూజలు చేసి భయభ్రాంతులకు గురిచేస్తూ నిధుల కోసం తవ్వకాలు జరిపిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!