
నేరేడుచర్ల: ఫిబ్రవరి 19 మన ప్రజాశక్తి
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధరుంజయ నాయుడు మాట్లాడుతూ…..మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి స్వరాజ్యం సాధించిన వీర శిరోమణి చత్రపతి శివాజీ అని పరాయి పాలకుల పట్ల యమకింకరుడు గా దేశ రక్షణే ధ్యేయంగా ధర్మ రక్షణే ధ్యానంగా స్వాభిమానమే ఆయుధంగా జాతి పౌరుషాన్ని చాటిన శత్రుభయంకరుడు చత్రపతి శివాజీ ఆయన అన్నారు.400 ఏళ్లలాడే దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాలని ఆ రోజుల్లోనే విత్తనాలు ఎద్దులు ఉచితంగా రైతులుకి అందించిన ఘన చరిత్ర ఛత్రపతిది అని రైతులు వ్యవసాయ కూలీలను కలిపి వారి అభివృద్ధి కొరకు కొరకు అనేక సంస్కరణలు చేపట్టి స్వరాజ్యం అనే నినాదాన్ని ప్రకటించిన ధీరుడు చత్రపతి అని, అణగారిన కులాల వారిని సైన్యంలోకి తీసుకున్న మొట్టమొదటి రాజు అని, మతసామర సేవకే ఎంతో కృషి చేశాడని బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి నిలిచాడని కుంభీ కులంలో పుట్టిన చత్రపతి బీసీ బిడ్డ అని ఆయన అన్నారు.కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రావుల సత్యం ఏఐవైఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చిలకరాజు శ్రీను బీసీ హక్కుల సాధన సమితి జిల్లా సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్ పట్టణ అధ్యక్షుడు బత్తిని శ్రీనివాసగౌడ్ బాలు పాల్గొన్నారు.

Recent Comments