Friday, March 6, 2026

ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

పాలకీడు : ఫిబ్రవరి 19 మన ప్రజాశక్తి
శివాజీ మహారాజ్ యువజన సంఘం నేతృత్వంలో జరిగిన శివాజీ మహారాజ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ యువజన నాయకులు మాట్లాడుతూ, హిందూ ధర్మ రక్షణ కోసం, స్వరాజ్య స్థాపన కోసం శివాజీ మహారాజ్ చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. నేటి యువత శివాజీ మహారాజ్ ఆశయాలను అలవర్చుకుని దేశభక్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాలకీడు సర్పంచ్ సుజాత, ఉప సర్పంచ్ లక్ష్మి సత్యం, యువజన నాయకులు, శ్రీను,హనుమంతరావు, సత్యం,సురేష్,రాజేష్, వీరయ్య, అన్వేష్, నవీన్, చంటి, సందీప్, సతీష్, వీరబాబు, కమల్, శిధర్, వేణు, బీజేపీ మండల అధ్యక్షులు, నారి నాయక్,తదితరులు పాలుగోన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!