
మేళ్లచెరువు,ఫిబ్రవరి 19 మన ప్రజాశక్తి:శ్రీ శంభు లింగేశ్వర స్వామి మేళ్లచెరువు మహాజాతర భక్తులకు తక్షణ వైద్య సహాయం అందించడానికి నీటిపారుదల & పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ఆదేశాలు మేరకు 108 అంబులెన్స్‌లను మోహరించింది. మేళ్లచెరువు జాతర ప్రాంతంలోని వివిధ కీలక ప్రదేశాలలో అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. రద్దీగా ఉండే ప్రదేశాలకు త్వరగా చేరుకుని, ఆలస్యం లేకుండా వైద్య సహాయం అందించడానికి అంబులెన్స్‌లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 108 సేవల ద్వారా జ్వరం, తలనొప్పి,వాంతులు,అలసట లేదా గుండె సంబందించిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న భక్తులకు అవసరమైన ప్రాథమిక చికిత్స అందించి
అంతేకాకుండా, పరిస్థితి తీవ్రంగా ఉన్న సందర్భాలలో భక్తులను సమీపంలోని ఆసుపత్రులకు తక్షణమే తరలించడానికి ఏర్పాట్లు చేస్తారు. జాతర కాలమంతా ఈ 108 అంబులెన్సు సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.
సమర్థవంతంగా సమన్వయం చేసుకుని చర్యలను అమలు చేయడం ద్వారా భక్తులందరి భద్రత, ఆరోగ్య పరిరక్షణను నిర్ధారించడమే తమ ప్రాథమిక లక్ష్యమని జిల్లా యంత్రాంగం చెబుతోంది.
నిరంతం వైద్య సేవలు జాతరకు వచ్చే భక్తులకు అందుబాటులో ఉంటాయి. జాతర ప్రాంగణంలోని అంబులెన్సు ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం లో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ షేక్ సలీం, సూర్యాపేట జిల్లా మేనేజర్ పుల్లూరు శివరాం,అంబులెన్సు సిబ్బంది తదితరులు.


Recent Comments