ఆమనగల్లు రామలింగేశ్వర స్వామి జాతర వద్ద ఘటన

ప్రజాశక్తి,మిర్యాలగూడ మార్చి 3:
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లులో మంగళవారం శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర కవరేజ్ కి వెళ్లిన అంతర్ముఖం (లోకల్ ఛానల్ ) ప్రతినిధిపై పోలీసులు దౌర్జన్యం ప్రదర్శించారు.బాధితుడు మాణిక్యం, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం… ఆమనగల్లు గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర జిల్లాలోనే ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు ఇతర గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు వచ్చి ఈ జాతరను తిలకిస్తుంటారు. అయితే మంగళ వారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ఆలయ వేడుకలకు హాజరయ్యారు. అయితే అంతర్ముఖం రిపోర్టర్….. జాతర వద్ద ఏర్పాటుచేసిన కబడ్డీ పోటీలను కవర్ చేసేందుకు వెళ్లాడు. నేను కవరేజ్ వచ్చానని నేను మీడియా ప్రతినిధిని అయితే అక్కడే విధులు నిర్వర్తిస్తున్న వాడపల్లి ఎస్ఐకి చెబుతున్నప్పటికీ… అవే మీ వినిపించుకొని సదురు ఎస్ ఐ,ఆ మీడియా ప్రతినిధిని నెట్టి వేశాడు. మరోవైపు స్పెషల్ పార్టీ పోలీసులు ఆ రిపోర్టర్ పై చేయి చేసుకున్నారు. అక్కడ జాతరకు వచ్చిన స్థానికులు …. అతను రిపోర్టర్ అతనిపై ఎందుకు దాడి చేస్తున్నారని పోలీసులను ప్రశ్నిస్తున్న వారు అవేమి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు దాడి చేయడంపై మీడియా వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుంది. దాడి చేసిన స్పెషల్ పార్టీ పోలీసులతోపాటు మీడియా ప్రతినిధిని నెట్టివేసిన వాడపల్లి ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని మీడియా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Recent Comments