Monday, January 26, 2026

బార్ కౌన్సిల్ లో అడ్వకేట్స్ వెల్ఫేర్, స్టాండింగ్ లేకుండా ఇవ్వాలి-హైకోర్ట్ న్యాయవాది రాపోలు భాస్కర్…!

ప్రజాశక్తి,మిర్యాలగూడ నవంబర్ 1:
తెలంగాణ బార్ కౌన్సిల్ అక్టోబర్ 31 వ తారీకు నాడు  విడుదల చేసిన వెల్ఫేర్ సర్క్యులర్, స్టాండింగ్ లేకుండా విడుదల చేయాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ డిమాండ్ చేశారు.వారు మాట్లాడుతూ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో స్టాండింగ్ అనేది లేకుండా అక్కడ బార్ కౌన్సిల్ తక్కువ అమౌంట్ తో సర్క్యులర్ ఇచ్చినారు తెలంగాణ బార్ కౌన్సిల్ స్టాండింగ్ తో పాటు ఎక్కువ అమౌంట్ తో సర్క్యులర్ ఇచ్చినారు.బార్ కౌన్సిల్ అనేది స్టాట్యుటరీ బాడీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక సర్క్యులర్ ఏంటి అని ప్రశ్నించారు. ఎస్సీ ,ఎస్టీ మైనారిటీ వర్గాల నుండి న్యాయవాద వృత్తిలోకి వస్తున్నారు.వారు అంత అమౌంట్ కి కట్టుకోలేని పరిస్థితి ఉన్నారు.ఇట్టి విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, బార్ కౌన్సిల్ చైర్మన్ కి అర్జీ ద్వారా  హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!