
మన ప్రజాశక్తి,వేములపల్లి అక్టోబర్ 10:
దామరచర్ల ప్రాజెక్టు పరిధిలోని వేములపల్లి మోడల్ స్కూల్ నందు పోషణ మాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిడిపిఓ చంద్రకళ ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి బాల బాలికలకు పోషకాహారము మిల్లెట్స్ చిరుధాన్యాలు పప్పులు పాలు పండ్లు మునగాకు గోంగూర బచ్చలకూర తోటకూర క్యారెట్లు బీట్రూట్లు పల్లీలు బెల్లం నువ్వులు ఖర్జూర గుడ్లు మాంసాహారం చేపలు తీసుకోవాలని పరిసరాల పరిశుభ్రత ,వ్యక్తిగత పరిశుభ్రత విద్య వల్ల కలిగే లాభాలు బాల్య వివాహాలు వల్ల కలిగే నష్టాలు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు చక్కెర నూనెలు ఉప్పు ఎక్కువ తీసుకోకూడదని పిల్లలకు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిడిపిఓ చంద్రకళ,మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సుజాత,హెల్త్ సి హెచ్ ఓ ప్రవీణ్,ఐసిడిఎస్ సూపర్వైజర్ రజని, హెల్త్ సూపర్వైజర్ శాంతా,ఏఎన్ఎం శైలజ,అంగన్వాడి టీచర్లు శశికళ, జయమ్మ, ఆశ వర్కర్ బాలురు, బాలికలు పాల్గొన్నారు.


Recent Comments