మన ప్రజాశక్తి,నిర్మల్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 18:
దైవదర్శనానికై వెళ్లి ఆనందంగా తిరిగి తమ ఇళ్లకు చేరేందుకు వస్తున్న సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు స్నేహితులకి చేదు అనుభవం ఎదురయింది. క్షతగాత్రులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని శిరిడి సాయిబాబా దర్శనానికై వరంగల్ నుండి ఐదుగురు స్నేహితులు అంతా కలిసి ఆనందంగా దర్శనం చేసుకుని వస్తున్న సమయంలో నిర్మల్ పట్టణంలోని కంచరోని చెరువు కట్ట రహదారిపై ఉదయం 05:50 ని.లకి వాహనం నడుపుతున్న వ్యక్తి నిద్రమత్తు రావడం వల్ల క్షణాల్లో జరిగిపోయిందని చెప్పుకొచ్చారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగానే పోలీసులు వచ్చి వివరాలు సేకరించి గాయపడిన వారిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు అంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ ఎవరికి ఎలాంటి తీవ్ర గాయాలు కాకపోవడం గమనార్హం. ఉదయమే అలా నిద్రమత్తు ఉండడం వల్ల దానికి తోడు దట్టమైన మంచు కురవడం కూడా ప్రమాదానికి కారణం అని చెబుతున్నారు. కానీ అక్కడి చిత్రాలను చూస్తుంటే ఎవరు ప్రాణాలతో ఉండే పరిస్థితి లేదన్నట్లు ఆ ప్రమాదం జరిగింది. షిరిడి దైవదర్శనానికై వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అందరిని కలిచివేసినప్పటికీ. ఎలాంటి ప్రాణ నష్టం గాని తీవ్ర గాయాలు కాకపోవడం వల్ల ఐదుగురు స్నేహితుల కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నట్లు అయింది. వారు వరంగల్ జిల్లా హనుమకొండ ప్రాంతానికి చెందిన వాళ్ళమని తెలిపారు. ఇదే విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుని దర్యాప్తు లో భాగంగా స్వల్పంగా గాయపడిన ఇద్దరిని ప్రథమ చికిత్స కోసం తరలించడం క్షేమంగా బయటపడ్డ మరో ముగ్గురిని పోలీసులు వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడమే కాకుండా మానవత్వాన్ని చాటేలా తాగేందుకు నీళ్లను ఇచ్చి, భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పడంభయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పడం చెప్తూ వారి పూర్తి వివరాలు కనుక్కునే పనిలో ఉన్నారు.


Recent Comments