ప్రజాశక్తి,మిర్యాలగూడ నవంబర్ 14:
అభ్యాస్ ప్రైమరీ స్కూలులో శుక్రవారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథులుగా చైర్మన్ వంగాల నిరంజన్ రెడ్డి, డైరెక్టర్ పుష్పలత ఆధ్వర్యంలో చిన్నారులు జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంగాల నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా నిర్వహిస్తారని తెలియజేశారు. అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు…జాతీయ నాయకుల వేషాలతో ఆపట్టుకున్నారు. క్విజ్ వ్యాసరచన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన చిన్నారులకు ప్రోత్సాహక బహుమతులను అందించారు.
ఈ కార్యక్రమంలో స్కూలు ప్రిన్సిపల్ ఫర్ హిన్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



Recent Comments