
ప్రజాశక్తి,ఆలేరు నవంబర్ 2:ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ వన్ ఫలితాలలో విజయం సాధించిన ముస్త్యాల సుగంధిని అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ గా జనగాం జిల్లాలో నియామకమైనారు.సుగంధిని చదివిన ఎన్టీఆర్ ట్రస్ట్ డిగ్రీ,ఐఏఎస్ స్టడీ సెంటర్ కళాశాల గండిపేట హైదరాబాద్ నందు ట్రస్ట్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి తమ కళాశాల విద్యార్థి ఉత్తమ ప్రతిభ కనబరిచి గ్రూప్ వన్ ఫలితాలలో అధికారిగా నియామకం కావడం తమ కళాశాలకు గర్వకారణమని ప్రశంసించారు.తమ కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శనివారం రోజు కుమారి సుగంధినిని శాలువాతో మెమొంటోతో సన్మానించి వారి తల్లిదండ్రులు ముస్త్యాల రవికుమార్ నిర్మల ని అభినందించారు.తమ కళాశాల విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన ఎన్టీఆర్ కళాశాల అకాడమిక్ డీన్,అధ్యాపక బృందం సన్మానించారు.సుగంధిని గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్, జూనియర్ లెక్చరర్ జేఎల్ వరుస విజయాలు సాధించారు.గ్రామీణ విద్యార్థులు సైతం పట్టుదలతో చదివితే ఉన్నత ఉద్యోగ అవకాశాలు సాధించవచ్చు అని ,తమ కళాశాలలో ఐఏఎస్,గ్రూప్ వన్ సాధన కోసం ప్రత్యేక శిక్షణ ఉంటుందని తెలియజేశారు.


Recent Comments