అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
రౌడీ షీటర్స్ కదలికపై ప్రత్యేక నిఘా ఏర్పాటు
జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్
ప్రజాశక్తి,నల్లగొండ అక్టోబర్ 24:
జిల్లాలో రౌడీ షిటర్స్ ఎవరైన అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని జిల్లా ఎస్పి హెచ్చరించారు. జిల్లా పరిదిలో వివిధ కేసులలో ఉన్న దాదాపు 40 మంది ముఖ్యమైన రౌడీ షిటర్లకు పిలిపించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా, ఇతర నేరాలకు పాల్పడకుండా ఉండాలని కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది.జిల్లా పరిధిలో రౌడీషీటర్స్, సస్పెక్ట్ షీటర్ల కార్యకలాపాలు పోలీసుల నిఘాలో ఉన్నాయని,చట్ట వ్యతిరేక కార్యలాపాలు ఆర్థిక,భూసెటిల్మెంట్లు లాంటివి చేస్తూ సామాన్య ప్రజలపై దౌర్జన్యాలు,బెదిరింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.తప్పు చేస్తే ఎంతటి వారైన చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఇప్పటికే పలువురికి శిక్షలు విధించడం జరిగిందని గుర్తు చేశారు.జిల్లాలో ప్రతి ఒక్కరి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసామని అన్నారు. ఎవరైన అసాంఘిక నేరాలకు పాల్పడితే వారిపై ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ (పీడీ యాక్ట్) నమోదు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. సత్ప్రవర్తనతో మెలిగే వారికి పోలీస్ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, తమ పాత పద్ధతులను వదులుకొని సత్ప్రవర్తనతో మంచిగా మారి ఎలాంటి నేరాలు చేయకుండా సమాజాభివృద్ధికి దోహాదపడుతూ ఉండాలని అన్నారు.శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజా రక్షణకు జిల్లా పోలీసు ఎల్లప్పుడు కృషి చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి,టూ టౌన్ సిఐ రాఘవ రావు, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఆర్.ఐ హరిబాబు, టూ టౌన్ ఎస్.ఐ సైదులు,రూరల్ ఎస్.ఐ సైదా బాబు తదితరులు ఉన్నారు.


Recent Comments