
ప్రజాశక్తి,మిర్యాలగూడ అక్టోబర్ 26:
వేములపల్లి మండలం ఆమనగల్లు ప్రైమరీ, హై స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో చినుకు పడితే చిత్తడే.తెలంగాణ రాష్ట్రమంతా ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా.. అభివృద్ధి చెందుతున్నాయి.ఆమనగల్లు పాఠశాలలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే విధంగా ఉంది.అభివృద్ధిలో వెనుకంజలో పాఠశాల.. వర్షం పడితే పాఠశాల చెరువును తలపిస్తూ..విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది.ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠశాలలోనే ప్రత్యేక శిక్షణ అందించడంతో విద్యార్థుల భవితకు బంగారు భవిష్యత్తు కు పునాదులు పాఠశాలలు.నేడు ఆ పాఠశాలకు ప్రభుత్వం కేటాయించే ప్రత్యేక నిధులు ఏమైనాయి…? మండల విద్యాశాఖ అధికారి ఇటీవల కాలంలో అనేకసార్లు పాఠశాలను విజిట్ చేశారు కాని సమస్యలు కనిపించడం లేదు.గత సంవత్సరం నుండి ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారికి,రాజకీయ నాయకులకు అనేకసార్లు..పాఠశాల గోడును.. వినిపించిన సంవత్సరాలు గడుస్తున్నా..ఫలితం శూన్యంగా మారింది.ఇకనైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి పాఠశాల అభివృద్ధికి సహకరించాలని విద్యార్థుల తల్లి దండ్రులు కోరుతున్నారు.

Recent Comments