Friday, March 6, 2026

ఆల్ బ్యాంకు మిత్ర అసోసియేషన్ ఆఫ్ ఇండియా సోషల్ మీడియా జిల్లా ప్రచార కార్యదర్శిగా గంట.కృష్ణయ్య యాదవ్ నియామకం

ప్రజాశక్తి,వేములపల్లి ఫిబ్రవరి 26:
ఆల్ బ్యాంకు మిత్ర అసోసియేషన్ ఆఫ్ ఇండియా సోషల్ మీడియా నల్లగొండ జిల్లా ప్రచార కార్యదర్శిగా గంట.కృష్ణయ్య యాదవ్ ఏకగ్రీవ ఎంపిక.ఆల్ బ్యాంక్ మిత్ర అసోసియేషన్ ఆఫ్ ఇండియా సోషల్ మీడియా నల్గొండ జిల్లా ప్రచార కార్యదర్శిగా అసోసియేషన్ రూల్స్ ప్రకారం బాధ్యతలను నిర్వర్తిస్తామని వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన గంట కృష్ణయ్య యాదవ్ తెలిపారు.గురువారం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దొమ్మేటి సైదులు అనుమతితో గంట.కృష్ణయ్య యాదవను ప్రచార కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు.ఈ సందర్భంగా క్రిష్ణయ్య యాదవ్ మాట్లాడుతూ ఆల్ బ్యాంకు మిత్ర అసోసియేషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ను అంగీకరిస్తూ ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు.ఏడాది కాలం పాటు ఈ పదవి ఉంటుందని చెప్పారు.అసోసియేషన్ రూల్స్ ను పాటించకుండా పొరపాట్లు జరిగిన స్వచ్ఛందంగా ఈ అసోసియేషన్ నుంచి తొలగించవచ్చని స్వయంగా తానే తప్పుకుంటానని చెప్పారు.అసోసియేషన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలుపుతూ…నాకు ఈ బాధ్యత అప్పగించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!