
ప్రజాశక్తి,మిర్యాలగూడ అక్టోబర్ 30:వనిత డైమండ్, లయన్స్, తరుణ, భాస్కర, దివ్యాంగ క్లబ్ లతో పాటు… ఇతర సామాజిక సంస్థలు పేదలకు అండగా నిలుస్తున్నాయని లయన్స్ క్లబ్ అధ్యక్షులు బీఎం నాయుడు, కార్యదర్శి కూటాల రాంబాబు తెలిపారు. గురువారం వనిత డైమండ్ క్లబ్ నుంచి నాగులవంచ ప్రణీతరావు పుట్టినరోజును పురస్కరించుకొని… ఆయన పేరెంట్స్ సూర్యకుమారి, బాబురావు దంపతులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో 150 మందికి అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. స్వచ్ఛంద, సామాజిక సంస్థలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. పేదలకు విద్య, వైద్యం, ఉపాధి కల్పన అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు లింగయ్య, భాస్కర క్లబ్ లయన్ లీడర్స్ ఏచూరి మురహరి, భాగ్యలక్ష్మి దంపతులతో పాటు… తరుణ క్లబ్ అధ్యక్షులు క్యామా వెంకటేశం, దివ్యాంగ క్లబ్ జనరల్ సెక్రటరీ ముత్యాల లక్ష్మీనారాయణ, వనిత డైమండ్ అధ్యక్షులు పసునూరి స్వప్న, మధు, కార్యదర్శి నక్క మంగతాయి, కోరే రమేష్, గట్టు వెంకటేశ్వర్లు, తదితరులు ఉన్నారు.

Recent Comments