నూతన సర్పంచ్ కు శుభాకాంక్షలు వెల్లువ…తెలంగాణ పత్రిక స్టేట్ బ్యూరో సురేష్

ప్రజాశక్తి,జగిత్యాల డిసెంబర్ 5:
జగిత్యాల రూరల్ మండలం కన్నపూర్ గ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవంగా కావడంతో కన్నాపూర్ గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి అయిన పుట్టపర్తిని సతీష్ మాట్లాడుతూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న కన్నాపూర్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క ఇంటికి అందే విధంగా కృషి చేస్తానని,ఎవరికి ఏ ఆపద ఉన్న ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు అందుబాటులో ఉంటానని తెలిపారు.ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సతీష్ కు, ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు సభ్యులకు,తెలంగాణ పత్రిక స్టేట్ బ్యూరో పురాణం సురేష్, జగిత్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీరం రాజేష్,జోగినిపల్లి వినోద్,నర్ర పృథ్వి,సాయి పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కన్నాపూర్ యువ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Recent Comments