
మన ప్రజాశక్తి,నల్లగొండ అక్టోబర్ 11:
వాడపల్లి పోలీస్ ఎస్సై, కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించినదని పలు పేపర్లలో నల్లగొండ జిల్లా సంచికలో ప్రచురితమైన కథనం పూర్తిగా అవాస్తవం.దామచర్ల మండలం కొత్తపేట తండాకు చెందిన సాయి సిద్దు అనే యువకుడు ఇటీవల యూరియా కోసం ధర్నా చేశారని వాడపల్లి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, కానిస్టేబుల్ విచక్షణారహితంగా కొట్టారని ఆరోపిస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయగా ఫిర్యాదు స్పందించిన మానవ హక్కుల కమిషన్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, కానిస్టేబుల్ లను వెంటనే విధుల నుంచి తొలగించాలని జిల్లా ఎస్పీ ని ఆదేశించినది అని వచ్చిన వార్త కథనంలో ఎలాంటి వాస్తవం లేదని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.మానవ హక్కుల కమిషన్ నుంచి నాలుగు వారాల్లో సమగ్ర విచారణ చేసి నివేదిక సమర్పించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వాస్తవ విషయాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు వార్తాపత్రికల్లో ప్రచురిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Recent Comments