
నేరేడుచర్ల: ఫిబ్రవరి 11 మన ప్రజాశక్తి
నేరేడుచర్ల మున్సిపాలిటీలో జరిగిన రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో సాఫీగా ముగిసింది ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా కొనసాగింది. మొత్తం 79.24 శాతం పోలింగ్ నమోదవడం విశేషం.*త్రి ముఖ పోటీతో ఉత్కంఠ భరిత సమరం*ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు వర్గాల మధ్య పోటీ నెలకొంది*బిజెపి పార్టీ అన్ని వార్డుల్లో ఒంటరిగా బరిలో దిగింది*
కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది.
>టిఆర్ఎస్ పార్టీ సిపిఎం జనసేన పార్టీల మద్దతుతో రంగంలోకి దిగింది.
>ఈ కూటములు వ్యూహాలు స్థానిక రాజకీయాల సమీకరణాలను ప్రభావితం చేశాయి ప్రతి వార్డులోనూ హోరాహోరి పోటీ కనిపించింది.
*మొత్తం ఓటర్లు : 13,746*
>మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 13,746 మంది ఓటర్లు ఉండగా
*పురుషులు: 6,629,మహిళలు: 7,116,ఇతరులు : 1,మహిళా ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉండటం విశేషం*
>10,893 మంది ఓటు హక్కు వినియోగం >మొత్తం 10893 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
*పురుషులు :5,142
*మహిళలు. :5750
*ఇతరులు. :1
మహిళల పోలింగ్ శాతం పురుషుల కంటే స్వల్పంగా ఎక్కువ నమోదయింది ఇది మహిళల్లో పెరుగుతున్న రాజకీయ చైతన్యాన్ని సూచిస్తుంది.
*ప్రశాంతంగా సాగిన ఎన్నికల ప్రక్రియ*
ఎన్నికల నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయబడింది. పోలింగ్ బూతుల వద్ద అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎటువంటి సంఘటనలు తలెత్తలేదు.
*శుక్రవారం కౌంటింగ్ ఫలితాలపై ఉత్కంఠ నెలకొని ఉంది*
బుధవారం పోలింగ్ ప్రక్రియ పూర్తికాగా, శుక్రవారం (13:02:2026) రోజున ఓట్లు లెక్కింపు చేపట్టనున్నారు. మూడు పార్టీల పోటీ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఏ పార్టీకి పట్టం కట్టనున్నారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది .

Recent Comments