Monday, January 26, 2026

కుటుంబాన్ని కోల్పోయిన నిత్య కు 5 లక్షల రూ..చెక్ అందజేత…!అధైర్యం పడొద్దు అండగా ఉంటా – జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

ప్రజాశక్తి,వేములపల్లి అక్టోబర్ 23:
తల్లి ,తండ్రి,సోదరుడిని కోల్పోయి అనాధగా మిగిలిపోయిన మాడుగులపల్లి మండలం,ఆగమోత్కూరుకు చెందిన బాలిక నిత్యకు అండగా ఉంటామని,ధైర్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా, వేములపల్లి మండల కార్యాలయంలో చేపట్టిన ఆధునికీకరణ పనుల పరిశీలన నిమిత్తం వేములపల్లి మండలానికి వచ్చారు.కాగా మాడుగులపల్లి మండలం ఆగమోత్కూరుకు చెందిన తండ్రి, కొడుకులు పున్న సాంబయ్య ,శివమణిలు గణేష్ నిమజ్జనం సందర్భంగా వేములపల్లి వద్ద ఉన్న కాలువలోకి దిగి ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతు కాగా , ఇదివరకే తల్లిని కోల్పోయిన చిన్నారి నిత్య తండ్రి, సోదరున్ని కూడా కోల్పోవడంతో అనాధగా మిగిలిపోయింది. విషయం తెలిసిన జిల్లా కలెక్టర్ చిన్నారి నిత్యకు అండగా నిలిచే క్రమంలో భాగంగా వేములపల్లి తహసిల్దార్ కార్యాలయంలో నిత్యకు 5 లక్షల రూపాయల చెక్కును అందించి ధైర్యం చెప్పారు. ధైర్యంగా ఉండాలని,బాగా చదువుకోవాలని అన్నారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, వేములపల్లి, మాడుగుల పల్లి తహసిల్దార్లు హేమలత, సరోజ పావని, డిప్యూటీ తహసిల్దార్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!