Monday, January 26, 2026

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

ప్రజాశక్తి,నల్లగొండ అక్టోబర్ 29:
మొంథా తుఫాను కారణంగా భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరిక జారీ చేశారు.ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇల్లు వదిలి బయటకు రావద్దు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. ట్రాన్స్ఫార్మర్లు,విద్యుత్ స్తంభాలు,విద్యుత్ వైర్ల చెంతకు వెళ్లవద్దు.లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పడిపోయేందుకు అవకాశం ఉన్న ఇండ్లలో ప్రజలు ఎవరు ఇళ్లల్లో ఉండకుండా సురక్షిత ప్రదేశాలలో ఉండాలి.మొంథా తుఫాను కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బుధవారం జిల్లాలోని పాఠశాలలు,అంగన్వాడీలకు స్థానిక సెలవు.భారీ వర్షాల పై జిల్లా కలెక్టరేట్ లో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ ఏర్పాటు.వర్షాల కు సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ 18004251442 కు సంప్రదించవచ్చు జిల్లా కలెక్టర్  ఇలా త్రిపాఠి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!