ఘనంగా జనహృదయనేత జన్మదిన వేడుకలు

మన ప్రజాశక్తి,మిర్యాలగూడ అక్టోబర్ 6:
వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ వల్లంపట్ల ప్రవీణ్ పుట్టినరోజు వేడుకలు మిర్యాలగూడ పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా ఐఎన్టీయుసీ రాష్ట్ర కార్యదర్శి బంటు చొక్కయ్య గౌడ్ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో రాజకీయపరంగా ఉన్నత శిఖరాల అధిరోహించాలని మనసారా కోరుకుంటూ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని ఆశీర్వదించారు.ప్రవీణ్ అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానాన్ని చాటారు.ఈ కార్యక్రమంలో మెరుగు భరత్, వరకాల సురేష్, మెరుగు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Recent Comments