అడవిదేవులపల్లి/ అక్టోబర్ 17/ (ప్రజాశక్తి )
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన అడవిదేవులపల్లి మండల కేంద్రంలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో జరిగినది.. స్థానిక సమాచారం మేరకు మృతురాలు రజిత మరియు ఆమెభర్త రమావత్ ఆంజనేయులు ఇరువురు తేజ టాలెంట్ స్కూల్ నడుపుతూ అడవిదేవులపల్లి గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు రమావత్ రజిత వయస్సు 30 సంవత్సరములు గురువారం రాత్రి అడవిదేవులపల్లిలో తను నివాసం ఉంటున్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొని మృతి చెందినది.. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారని తెలిపారు.. వెంటనే స్థానిక ఎస్సై శేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ కి తరలించారు…


Recent Comments