దేశ ఐక్యత కోసం కృషి చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్

ప్రజాశక్తి,నల్లగొండ అక్టోబర్ 31:
జాతీయ ఐక్యత దినోత్సవం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ 150 వ జయంతి సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ పర్ యూనిటీ కార్యక్రమంలో బాగంగా 2కె రన్ కార్యక్రమం పట్టణ కేంద్రంలోని యన్.జి కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ జెండా ఊపి ప్రారంభించి, పోలీస్ అధికారులు, సిబ్బంది,స్థానిక యువత, విద్యార్ధిని విద్యార్థులు,ఇతర అధికారులు దాదాపు 500 మందితో కలిసి దేశ సమైక్యతను పత్రిబంబించేలా ఉత్సాహంగా ఈ పరుగులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సర్దార్ పటేల్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడుతూ భారత దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించి, 550 కి పైగా సంస్థానాలను భారత దేశంలో విలీనం చేయుటకు దృడ సంకల్పంతో ఏలాంటి వత్తిడికి లొంగకుండా కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయి పటేల్ అన్నారు. అతని150 వ జయంతి సందర్భంగా మనందరం ఆయన ఆశయాలను గుర్తు చేసుకుంటూ దేశ సమగ్రత, ఐక్యత దేశ భక్తితో కలిసి ఉంటూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.అనంతరం జాతీయ ఐక్యత దినోత్సవ ప్రతిజ్ఞ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్,నల్లగొండ డిఎస్పి శివరాంరెడ్డి, ఏఆర్ డిఎస్పి శ్రీనివాసులు, సిఐలు రాజశేఖర్ రెడ్డి,మహా లక్ష్మయ్య, జితేందర్ రెడ్డి, శ్రీను నాయక్,రఘువీర్ రెడ్డి ఆర్ ఐ లు సంతోష్, శ్రీను,సూరప్ప నాయుడు, హరిబాబు ఎస్సైలు సైదులు, గోపాల్ రావు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Recent Comments