ప్రజాశక్తి,మిర్యాలగూడ నవంబర్ 2:
కార్తీక మాసం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని హనుమాన్ పేట శిరిడి సాయి బాబా మందిరంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆలయ కమిటీ వారు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గోవింద్ పాండే ఆధ్వర్యంలో స్వామివారి కి ధూప దీప నైవేద్యాలతో శతనాయన స్వామి వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఇట్టి కార్యక్రమానికి భక్తులు దంపతులు అధిక సంఖ్యలో పాల్గొన్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు అనంతరం చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసిన కమిటీ సభ్యులు.కార్యక్రమంలో ఆలయ అధ్యక్ష కార్యదర్శులు దయాకర్, నీలా పాపారావు, పెండ్యాల పద్మ, గంధం సైదులు, పంతులు శ్రీనివాస్, గార్లపాటి శ్రీనివాస్, విజయ, కీర్తి అశోక్ తదితరులు పాల్గొన్నారు.


Recent Comments