
ప్రజాశక్తి,మిర్యాలగూడ అక్టోబర్ 15:
రక్తదానంతో ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని నారాయణ కాలేజీ కెమిస్ట్రీ లెక్చరర్ కుంటిగొర్ల గణేష్ అన్నారు. స్థానిక వినాయక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పన్నెండేళ్ల ఏళ్ల కావ్యశ్రీ కి ఏ పాజిటివ్ ప్లేట్లెట్స్ అవసరం కాగా… విధులను మధ్యలోనే వదిలేసి జ్యోతి హాస్పిటల్ కి వచ్చిన లెక్చరర్ గణేష్ ప్లేట్లెట్స్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటికే 15 పర్యాయాలు రక్తదానం… ఐదుసార్లు ప్లేట్లెట్స్ ఇవ్వటం జరిగిందని చెప్పారు. రక్తదానం నిండు ప్రాణాలను కాపాడుతుందన్నారు.50 కేజీల బరువు ఉండి ఆరోగ్యంతో ఉన్నవారు రక్తదానం చేయవచ్చని చెప్పారు. యువత రక్తదానంపై అవగాహన పెంచుకొని… ఆపదలో ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధు, అవిరెండ్ల సందీప్, పరంగి సైదులు, వరకాల సురేష్ తదితరులు ఉన్నారు.

Recent Comments