ప్రజాశక్తి,నల్లగొండ నవంబర్ 25:
ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి హెచ్చరించారు.మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై కలెక్టర్ సమావేశం నిర్వహించారు.గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికారులు ఎన్నికల నియమాలను తు. చ తప్పకుండా పాటించచాలన్నారు.ఎంపీడిఓ లు,ఎంపిఓ లు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి మరోసారి అవసరమైన మౌలిక సదుపాయాలు పరిశీలించాలని చెప్పారు.ముఖ్యంగా విద్యుత్,తాగు నీరు,ర్యాంపులు,తదితర సౌకర్యాలు చూడాలన్నారు.ఎన్నికల నిర్వహణలో భాగ స్వాములైన అధికారులు,సిబ్బంది ఎన్నికల విధులు అత్యంత బాధ్యతతో నిర్వహించాలని,ఎన్నికల విధుల్లో ఎలాంటి అలసత్వం, నిర్లక్ష్యం వహించినా విధులకు హాజరు కాకపోయినా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్. జె శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జడ్పీ సీఈవో శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, ఎంపీడీవోలు, ఎంపీఓలు హాజరయ్యారు.


Recent Comments